శివాజీ రాజా! మీ టోకెన్ నంబర్ వచ్చేసింది: శ్రీరెడ్డి

  • 'మా' పెద్దలు వేధించారన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రుతి 
  • టీవీ చానల్ చర్చలో పాల్గొని ఆరోపణలు
  • సమాధానం చెప్పాలని శివాజీ రాజాకు శ్రీరెడ్డి డిమాండ్
'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) పెద్దలు కూడా లైంగికంగా వేధించే వారేనని, మా అసోసియేషన్ లోనూ వేధింపులకు పాల్పడే వారు ఉన్నారని, ఎవరైనా దొరికితేనే దొంగలని క్యారెక్టర్ నటి శ్రుతి ఓ టీవీ చానల్ చర్చలో ఆరోపించిన నేపథ్యంలో నటి శ్రీరెడ్డి స్పందించింది.

"ది గ్రేట్ మా అధ్యక్షుడు శివాజీ రాజా గారూ... మీ టోకెన్ నంబర్ వచ్చింది. పదిమందికి న్యాయం చేయాల్సిన కుర్చీలో ఉండి ఈ రాసలీలలు ఏంటండీ?" అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, మా అధ్యక్ష పదవికి శివాజీ రాజా అనర్హులని వ్యాఖ్యానించింది. తప్పెవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది.
Go Back to Shorts
MAA
Tollywood
Casting Couch
Sri Reddy
Sruti

More Telugu News